Betting Apps: అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా
- అక్రమ బెట్టింగ్ యాప్ లపై కేంద్రం ఉక్కుపాదం
- తాజాగా 22 యాప్ లు, వెబ్ సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం
- ఈడీ దర్యాప్తు అనంతరం చర్యలు
- బ్లాక్ చేసిన యాప్ ల జాబితాలో మహదేవ్ బుక్ బెట్టింగ్ యాప్
దేశంలో అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిశ్చయించింది. ఈ నేపథ్యంలో, పలు అక్రమ బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. 22 బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్ల కార్యకలాపాలను కేంద్రం బ్లాక్ చేసింది. కేంద్రం బ్లాక్ చేసిన యాప్ ల జాబితాలో ఇటీవల కలకలం రేపిన మహదేవ్ బుక్ బెట్టింగ్ యాప్ కూడా ఉంది. బెట్టింగ్ యాప్ ల కార్యకలాపాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు తర్వాత కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. ఛత్తీస్ గఢ్ లో మహదేవ్ బుక్ యాప్ అక్రమాలకు పాల్పడుతోందని ఐటీ శాఖ వెల్లడించింది.