Bandi Sanjay: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నామినేషన్ పత్రాలకు బండి సంజయ్ పూజలు

Bandi sanjay visits mahashakti temple before filing nomination papers
  • నామినేషన్‌ పేపర్ల దాఖలుకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సంజయ్
  • అనంతరం, స్వగృహంలో తన మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్న వైనం
  • సంజయ్‌ను ఆయన కార్యాలయంలో కలిసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
కరీంనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నేడు కరీంనగర్ మహాశక్తి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన నివాసానికి వచ్చి అక్కడ తన మాతృమూర్తికి పాదాభివందనం చేశారు. 

కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బండి సంజయ్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఇరు నేతలు, పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ ఎన్టీఆర్ విగ్రహ చౌరస్తాకు వెళ్లారు. ఈ క్రమంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Bandi Sanjay
BJP
Karimnagar District

More Telugu News