CM Kcr: సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం

CM Kcr Helicopter Emergency Landing due to Technical Fault
  • ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కేసీఆర్
  • కొద్దిసేపటి క్రితం దేవరకద్రకు బయలుదేరిన సీఎం
  • సాంకేతిక లోపం గుర్తించి అప్రమత్తమైన పైలట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే దేవరకద్రకు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కాసేపటికి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే హెలికాఫ్టర్ ను ఎర్రవల్లికి మళ్లించారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లోని హెలిప్యాడ్ పై క్షేమంగా దించారు. సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో హెలికాఫ్టర్ ను సిద్ధం చేస్తున్నట్లు ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.

CM Kcr
Helicopter
Emergency Landing
Technical Fault
Erravalli

More Telugu News