KTR: నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసిన కేటీఆర్
- యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్
- దేఖ్ లేంగే పాటకు పలువురితో కలిసి కాలు కదిపిన కేటీఆర్
- నెట్టింట వైరల్గా మారిన మంత్రి డ్యాన్స్ వీడియోలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చిందేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన డ్యాన్స్ చేసి, అందరినీ అలరించారు. దేఖ్ లేంగే పాటకు స్టేజ్ పైన పలువురితో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. కేటీఆర్ చిందేయడంతో కార్యకర్తలు, నాయకులు ఆనందంలో మునిగిపోయారు. అంతకుముందు ప్రచారంలో గులాబీ జెండాలే రామక్కా పాటకు కాస్త చిన్నగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తనకు జన్మనిచ్చింది తల్లి అయితే రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల అన్నారు. దేశంలోనే సిరిసిల్లను నెంబర్ వన్ నియోజకవర్గంగా మార్చుతానన్నారు. ఈ తొమ్మిదన్నరేళ్లలో మనవద్ద ఎలాంటి కర్ఫ్యూ లేదన్నారు. ప్రతి ఊరు, పల్లె, పట్టణం అభివృద్ధి బాటలో సాగుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ వందల మంది ప్రాణాలు తీసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కాలిపోయే ట్రాన్సుఫార్మర్లు ఉండేవన్నారు. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అంటూ వస్తోందని, కానీ 11 సార్లు అవకాశమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.