Justice Prashanth Kumar: సుప్రీంకోర్టులో ఏపీలో దొంగ ఓట్ల కేసు.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

Supreme Court Justice Prashanth Kumar says not before me in Andhra Pradesh votes removal case

  • పిటిషన్ వేసిన నిమ్మగడ్డ రమేశ్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ
  • తాను గతంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశానన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్
  • అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడి

ఏపీలో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ఈ పిటిషన్ విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు. నాట్ బిఫోర్ మీ చెప్పారు. గతంలో తాను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశానని... అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నానని ఆయన తెలిపారు. 

మరోవైపు, ఏపీలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయంటూ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, కేసు నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు. దీంతో, చీఫ్ జస్టిస్ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు ఈ పిటిషన్ ను లిస్ట్ చేయాలంటూ రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు.

  • Loading...

More Telugu News