Hotel booking: హోటల్ బుకింగ్ లో ఆన్ లైన్ మోసాలు.. నిపుణుల సూచనలు ఇవిగో!

100 tourists in Puri fell prey to online hotel fraud

  • ఇటీవల వంద మందికి పైనే మోసపోయారంటూ నివేదిక
  • అసలు హోటలే లేకున్నా ఆన్ లైన్ లో బుకింగ్ ఓపెన్
  • మోసపోతున్న పర్యాటకులు.. టూర్ సరదా మొత్తం ఆవిరి

సెలవుల్లో కొత్త ప్రాంతాలకు వెళ్లి సేదదీరాలని భావించే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. రొటీన్ లైఫ్ తో విసుగెత్తి కాస్త మార్పు కోసం పర్యాటక ప్రాంతాలకు వెళ్లి వస్తున్న కుటుంబాలను ఆన్ లైన్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా టూర్ కు బయలుదేరిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. అసలు లేని హోటల్ పేరుతో ఆన్ లైన్ లో బుకింగ్స్ తీసుకుంటున్నారు. చవకగా మంచి హోటల్ గది దొరికిందని భావించిన పర్యాటకులు.. తీరా అక్కడికి వెళ్లాకే మోసపోయామని తెలుసుకుంటున్నారు. దీంతో టూర్ సంతోషం మొత్తం ఆవిరవుతుంది. ఇటీవల వంద మందికి పైగా ఇలాగే మోసపోయారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ హోటల్ బుకింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణుల సూచనలు మీకోసం..

  • హోటల్ గది బుక్ చేసే ముందు అసలు ఆ హోటల్ నిజంగానే అక్కడ ఉందా, లేదా అనే విషయం నిర్ధారించుకోవాలి.. కాస్త రీసెర్చ్ చేస్తే ఈ విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రివ్యూలు, కాంటాక్ట్ నెంబర్లతో విచారించాలి. ఈ ప్రాసెస్ లో ఏమాత్రం అనుమానం వచ్చినా.. ఆ హోటల్ ను మీ లిస్ట్ లో నుంచి తప్పించండి.
  • ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో మోసగాళ్లు విసిరే వలకు చిక్కకుండా పేరున్న వెబ్ సైట్ల ద్వారా హోటల్ బుకింగ్ చేసుకోవడం ఉత్తమం.
  • బుకింగ్ కోసం ఆన్ లైన్ పేమెంట్ చేసేటపుడు ఆ వెబ్ సైట్ ఎస్ఎస్ఎల్ (సెక్యూర్ సాకెట్స్ లేయర్) ఎన్ క్రిప్షన్ ను నిర్ధారించుకోవాలి. వెబ్ సైట్ అడ్రస్ ను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు యూఆర్ఎల్ లో పాడ్ లాక్ సింబల్ సరిచూసుకోవాలి.
  • హోటల్ వారు చెప్పే డీల్స్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. మరీ ఊరించేలా ఉన్న ఆఫర్ ను సందేహించాల్సిందే.
  • బుకింగ్ పూర్తిచేశాక హోటల్ కు ఫోన్ చేసి రిజర్వేషన్ ను కన్ఫర్మ్ చేసుకోవాలి. సదరు హోటల్ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న నెంబర్ కు ఫోన్ చేయడమే మేలు. థర్డ్ పార్టీ వెబ్ సైట్లలో కనిపించే నెంబర్ల జోలికి వెళ్లవద్దు.
  • హోటల్ బుకింగ్ కు సంబంధించి క్యాన్సిలేషన్ పాలసీని జాగ్రత్తగా చదివాకే ముందుకెళ్లాలి. క్యాన్సిలేషన్ ఛార్జీలు మరీ ఎక్కువనిపిస్తే బుకింగ్ చేసేముందు పునరాలోచించాలి.
  • ఏదైనా హోటల్ బుకింగ్ కు సంబంధించి అనుమానాస్పద అంశాన్ని గుర్తిస్తే వెంటనే సంబంధిత వ్యక్తులు, సంస్థలకు ఫిర్యాదు చేయాలి. దీనివల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు ఆన్ లైన్ మోసగాళ్ల బారిన పడకుండా మిగతా వారినీ కాపాడినట్లు అవుతుంది.
  • ఆన్ లైన్ బుకింగ్ చేసేటపుడు వ్యక్తిగత వివరాల విషయంలో అలర్ట్ గా ఉండాలి.
  • చివరగా.. బుకింగ్ చేసేముందు అంతర్గతంగా మోసపోతున్నట్లు అనిపించినా, భద్రత గురించి సందేహం వ్యక్తమైనా ఆ బుకింగ్ ను వెంటనే ఆపేయండి.

  • Loading...

More Telugu News