KCR: గజ్వేల్, కామారెడ్డిలలో రేపే సీఎం కేసీఆర్ నామినేషన్
- మధ్యాహ్నం గం.11 నుంచి 12 మధ్య గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్
- మధ్యాహ్నం గం.2 నుంచి గం.3 మధ్య కామారెడ్డిలో సీఎం నామినేషన్
- సాయంత్రం గం.4 నుంచి గం.5 మధ్య కామారెడ్డి సభలో ప్రసంగించనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన గజ్వేల్, కామారెడ్డిలలో పోటీ చేస్తున్నారు. రేపు (9, గురువారం) రెండుచోట్ల ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. తొలుత గజ్వేల్, ఆ తర్వాత కామారెడ్డికి వెళ్తారు.
ఉదయం గం.10.45 నిమిషాలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా గజ్వేల్‌కు బయలుదేరుతారు. గం.10.55కు గజ్వేల్‌లో ల్యాండ్ అవుతారు. మధ్యాహ్నం గం.11 నుంచి గం.12 మధ్య నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత తిరిగి ఫామ్ హౌస్ చేరుకొని భోజనం చేస్తారు. మధ్యాహ్నం గం.1.40కి కామారెడ్డికి బయలుదేరుతారు. గం.2 నుంచి గం.3 మధ్య కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. సాయంత్రం గం.4 నుంచి గం.5 మధ్య కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.
రేపు సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్
తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేపే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం గం.11.45 నిమిషాలకు ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించనున్నారు.