Parliament: డిసెంబరు 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

Parliament Winter Sessions will commence from December 4

  • పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు
  • డిసెంబరు 4 నుంచి 22 వరకు సమావేశాలు
  • సోషల్ మీడియాలో వెల్లడించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 4 నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 19 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో 15 సెషన్ల పాటు సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. అమృత కాల మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ సమావేశంలో అనేక వ్యవహారాలు చర్చకు రానున్నాయని పేర్కొన్నారు.

టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా విషయం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రాకు డబ్బులు ఇచ్చానని ఓ వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.

ఇక, బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో తీసుకురాబోయే కొత్త చట్టాలపైనా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News