Super Star Krishna: విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమలహాసన్

Super Star Kamal Haasan Unveiled Super Star Krishna Statue
  • గురునానక్ కాలనీలో విగ్రహావిష్కరణ
  • వైసీపీ నేత దేవినేని అవినాశ్‌తో కలిసి ఆవిష్కరణ
  • కమలహాసన్‌కు థ్యాంక్స్ చెప్పిన అవినాశ్
దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని మరో సూపర్ స్టార్ కమలహాసన్ విజయవాడలో ఆవిష్కరించారు. నగరంలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాశ్‌తో కలిసి కమలహాసన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. 

ఆయన వారసుడు మహేశ్‌బాబు సినీ రంగంలో తనదైన ముద్ర వేయడంతోపాటు సేవా రంగంలోనూ ముందున్నారని కొనియాడారు. షూటింగ్స్‌తో నిత్యం బిజీగా ఉండే కమలహాసన్ విజయవాడ వచ్చి కృష్ణ విగ్రహన్ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని, విజయవాడ ప్రజలు, కృష్ణ, మహేశ్‌బాబు అభిమానుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.
Super Star Krishna
Kamal Haasan
Vijayawada
Devineni Avinash

More Telugu News