Yanamala: బీసీల కులగణన జరగాల్సిందే: యనమల
- ఏలూరులో అఖిలపక్ష సమావేశం
- 'బీసీలకు ప్రభుత్వ నమ్మక ద్రోహం' అనే అంశంపై చర్చ
- హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ, బీఎస్పీ నేతలు
- ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల
'బీసీలకు ప్రభుత్వ నమ్మక ద్రోహం' అనే అంశంపై ఏలూరులో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ, బీఎస్పీ నేతలు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ అఖిలపక్ష భేటీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీలు కుతంత్రాలను తట్టుకుని ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీసీల కులగణన కచ్చితంగా జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా బీసీలకు అధిక సాయం అందాలని అన్నారు. రాజకీయాల్లో సేవా భావం పోయిందని, డబ్బే ప్రధానంగా మారిందని యనమల విచారం వ్యక్తం చేశారు.