chandramohan: బాలు, చంద్రమోహన్, కె.విశ్వనాథ్.. మధ్య బంధుత్వం!

The relationship between sp balu k vishwanath and chandrmohan
  • ముగ్గురు దిగ్గజాలు అక్కాచెల్లెళ్ల కొడుకులే
  • సినిమాల్లోకి వచ్చాకే బంధుత్వం గురించి తెలిసిందట!
  • ఈ విషయం బయటపెట్టకుండా దాచేసిన దిగ్గజాలు
ఒకరేమో ప్రజాభిమానం చూరగొన్న నటుడు.. మరొకరేమో అద్భుతమైన కళాఖండాలను తీసిన దర్శకుడు, ఇంకొకరేమో గానగంధర్వుడు.. తెలుగు సినీ పరిశ్రమలో ముగ్గురు దిగ్గజాలు వాళ్లు. సినిమా బంధమే కాకుండా వారి మధ్య బంధుత్వం కూడా ఉందట. వరుసకు ముగ్గురూ అన్నదమ్ములేనని సినిమాల్లోకి వచ్చినపుడే తెలిసినా గుట్టుగానే ఉంచేశారు. వాళ్లే.. చంద్రమోహన్, కె.విశ్వనాథ్, ఎస్పీ బాలు.. ముగ్గురూ ఇండస్ట్రీలోని మూడు విభాగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ప్రేక్షకులను అలరించి, వారి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

తొలుత ఎస్పీ బాలు, ఆపై కె.విశ్వనాథ్.. ఇప్పుడు చంద్రమోహన్ దివికేగారు. ఈ ముగ్గురూ అక్కాచెల్లెళ్ల పిల్లలేనట. కె.విశ్వనాథ్ తండ్రి మొదటి భార్య, చంద్రమోహన్ తల్లి, అక్కాచెల్లెళ్లు.. అలాగే చంద్రమోహన్‌ బావ మరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా ఈ ముగ్గురూ అన్నదమ్ములు. ఈ ముగ్గురు అన్నదమ్ములూ పనిచేసిన శంకరాభరణం సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.
chandramohan
death
film industry
actor death
entertainment
telugu movies
SP Balu
K.viswanath

More Telugu News