Joint Manifesto: ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

TDP and Janasena parties established joint manifesto committee

  • ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు
  • ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని ఇరు పార్టీల నిర్ణయం
  • కమిటీలో టీడీపీ సభ్యులుగా యనమల, పట్టాభి, అశోక్ బాబు
  • జనసేన తరఫున వరప్రసాద్, శశిధర్, శరత్ లకు కమిటీలో చోటు
  • ఈ నెల 13న సమావేశం కానున్న ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ

ఏపీలో జగన్ పాలనకు తెర దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు పార్టీలు ఒకే మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల నిర్ణయించాయి. ఈ మేరకు నేడు ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్... జనసేన పార్టీ తరఫున వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రూపకల్పనపై ఈ కమిటీ నవంబరు 13న సమావేశం కానుంది. 

టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పాయింట్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లింది. పొత్తు అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ 'షణ్ముఖ వ్యూహం' పేరిట మరో 6 అంశాలు ప్రతిపాదించారు. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ పవన్ ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుని తాజా మేనిఫెస్టోకు రూపకల్పన చేయనుంది.

  • Loading...

More Telugu News