Artificial Inteligence: కృత్రిమ మేధ సాయంతో ఒకేసారి వేల ఉద్యోగాలకు దరఖాస్తు.. రెస్పాన్స్ ఎలా ఉందంటే..!

AI Powered Job GPT In job search

  • లేఆఫ్ ల కారణంగా పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య
  • ఉద్యోగం సంపాదించడం మరింత కష్టమవుతోందంటున్న నిపుణులు
  • ఏఐ సాయం తీసుకుని ఉద్యోగ వేట ప్రారంభించిన ఓ మాజీ ఉద్యోగి
  • ఒకే రాత్రిలో వేల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన జాబ్ జీపీటీ

ప్రముఖ కంపెనీలు కూడా లేఆఫ్ లు ప్రకటించి చాలామంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవానికి తగ్గ ఉద్యోగం చేజిక్కించుకోవడం అంత సులభం కాదు. వందలాది కంపెనీలకు దరఖాస్తు చేసి, ఇంటర్వ్యూలలో మెప్పించినా సరే.. అపాయింట్ మెంట్ లెటర్ అందుకునేదాకా గ్యారంటీ లేదు. ఆఫర్ లెటర్ ఇచ్చినా జాబ్ లో చేరేదాకా సదరు ఆఫర్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే ఓ వ్యక్తి ఏఐ (కృత్రిమ మేధ) సాయం తీసుకున్నాడు.

జూలియన్ జోసెఫ్ అనే వ్యక్తి ఇటీవల ఉద్యోగం కోల్పోయాడు. ప్రతీ కంపెనీకి దరఖాస్తు చేస్తూ తన అనుభవం, అర్హతకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేపట్టాడు. స్వయంగా 300 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న జోసెఫ్.. కృత్రిమ మేధను ఆశ్రయించాడు. ఏఐ సాయంతో పనిచేసే జాబ్ జీపీటీ ఏఐ బాట్ కు తన అర్హతలతో పాటు ఉద్యోగ వివరాలకు సంబంధించి కొంత సమాచారం అందించాడు. దీంతో ఒకే ఒక రాత్రిలో జోసెఫ్ తరఫున వెయ్యి కంపెనీలకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసింది.

మరుసటి రోజు కూడా ప్రయత్నించి మొత్తం 5 వేల ఉద్యోగాలకు దరఖాస్తు చేశానని జోసెఫ్ చెప్పాడు. అయితే, ఏఐతో పంపిన దరఖాస్తులకు కంపెనీల నుంచి స్పందన నామమాత్రంగానే ఉందని, తాను స్వయంగా దరఖాస్తు చేసిన 300 కంపెనీలలో 20 కంపెనీల నుంచి ఇంటర్వ్యూకు కాల్ వచ్చిందని తెలిపాడు. కృత్రిమ మేధతో వేల కంపెనీలకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు కానీ తగిన రెస్పాన్స్ రావాలంటే స్వయంగా దరఖాస్తు చేసుకోవడమే మేలని తనకు అనుభవంలోకి వచ్చిందని చెప్పాడు. 

  • Loading...

More Telugu News