Cricket: వరల్డ్ కప్‌లో ముగిసిన లీగ్ దశ.. 10 జట్లు చివరికి ఏయే స్థానాల్లో నిలిచాయంటే!
- అగ్రస్థానంలో టీమిండియా.. చిట్టచివరి స్థానంలో నెదర్లాండ్స్
- 7వ స్థానంతో ప్రస్థానాన్ని ముగించిన ఇంగ్లండ్
- వరుసగా 5వ, 6వ స్థానాల్లో నిలిచిన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు
ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్‌తో వన్డే వరల్డ్ కప్ 2023లో లీగ్ దశ ముగిసింది. టోర్నీలో పాల్గొన్న 10 జట్లు 9 చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌లకు 9 విజయాలు సాధించిన టీమిండియా 18 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. నెట్ రన్ రేటు విషయంలో కూడా ఏ జట్టుకీ అందనంత ఎత్తులో 2.570గా ఉంది. ఇక 7 విజయాలతో 14 పాయింట్లు, 1.261 నెట్ రన్ రేటుతో దక్షిణాఫ్రికా రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియా 7 విజయాలతో 14 పాయింట్లు, 0.841 నెట్ రన్ రేటుతో మూడవ స్థానంలో, 5 విజయాలు, 0.743 నెట్ రన్ రేటుతో న్యూజిలాండ్ 4వ స్థానంలో నిలిచాయి. దీంతో టాప్-4లో నిలిచిన ఈ జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించాయి.
అయితే నెదర్లాండ్స్‌పై టీమిండియా గెలుపు అనంతరం మిగతా జట్లు ఏయే స్థానాల్లో తమ ప్రస్థానాన్ని ముగించాయో స్పష్టత వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 7వ స్థానంలో, ఫేవరెట్ జట్లలో ఒకటిగా భావించిన పాకిస్థాన్ 5వ స్థానానికి పరిమితమయ్యాయి.
పాయింట్ల పట్టిక ఏ స్థానంలో ఏ జట్టు..
1. ఇండియా - 9 విజయాలు ( 2.570)
2. దక్షిణాఫ్రికా - 7 విజయాలు ( 1.261)
3. ఆస్ట్రేలియా - 7 విజయాలు ( 0.841)
4. న్యూజిలాండ్ - 5 విజయాలు (0 .743)
5. పాకిస్థాన్ - 4 విజయాలు (-0.199)
6. ఆఫ్ఘనిస్థాన్ - 4 విజయాలు (-0.336)
7. ఇంగ్లండ్ - 3 విజయాలు (-0.572)
8. బంగ్లాదేశ్ - 3 విజయాలు (-1.087)
9. శ్రీలంక - 2 విజయాలు (-1.419)
10. నెదర్లాండ్స్ - 2 విజయాలు (-1.825)
కాగా నెదర్లాండ్స్‌పై టీమిండియా ఘనవిజయం అందుకున్న విషయం తెలిసిందే. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగగా, పేసర్లు కూడా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించడంతో 160 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా 9వ విజయం.