Jammu And Kashmir: కశ్మీర్ శారదా దేవి ఆలయంలో 75 ఏళ్లకు మళ్లీ దీపావళి!

Diwali celebrated at Sharda Devi temple for first time in 75 years as temples lit up across Kashmir

  • కుప్వారా జిల్లాలోని శారదా దేవీ ఆలయంలో 1948 తరువాత తొలిసారిగా దీపావళి
  • దీపకాంతులతో మెరిసిపోతున్న దేవాలయానికి పోటెత్తిన భక్తులు
  • ప్రత్యేక పూజలు, బాణసంచా కాల్చి పులకించిపోయిన వైనం

కశ్మీర్‌లోని కుప్వారా జిలాల్లో మాతా శారదాదేవీ ఆలయంలో 75 ఏళ్ల తరువాత తొలిసారిగా దీపావళి వేడుకలు జరిగాయి. దీపకాంతులతో మెరిసిపోతున్న ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. బాణసంచా కాల్చి పరవశించి పోయారు.  

వాస్తవాధీన రేఖకు సమీపంలోని ఈ దేవాలయాన్ని ఇటీవల పునరుద్ధరించారు. 1948 తరువాత ఇక్కడ దీపావళి జరగడం ఇదే తొలిసారి. అప్పటి భారత్-పాక్ విభజన నేపథ్యంలో గిరిజనుల దాడిలో ఈ దేవాలయం ధ్వంసమైంది. కాగా, ఈ గుడిని కార్తార్‌పూసాహిబ్ కారిడార్ రీతిలో అభివృద్ధి చేసి పునర్వైభవం తీసుకురావాలని శారదా పీఠం ట్రస్టు వ్యవస్థాపకుడు రవీందర్ పండిత కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News