Pollution: దీపావళి బాణసంచాతో ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం

Pollution rises in Delhi and NCR due to Diwali firecrackers
  • ఢిల్లీలో మరోసారి పైపైకి వాయు కాలుష్యం స్థాయులు
  • 24 గంటల వ్యవధిలో 140 శాతం వరకు పెరిగిన వైనం
  • నిన్న ఉదయం 7 గంటల నుంచి ఇవాళ్టి వరకు గాలి నాణ్యతలో తీవ్ర మార్పు
సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచా కాల్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దీపావళి బాణసంచా కారణంగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. 24 గంటల వ్యవధిలోనే కాలుష్యం 100 శాతానికి పైగా పెరిగినట్టు గుర్తించారు. నిన్న ఉదయం 7 గంటల నుంచి ఇవాళ్టి వరకు గాలి నాణ్యతలో తీవ్ర మార్పులు వచ్చినట్టు నిర్ధారణ అయింది. ఈ స్థాయిలో వాయు కాలుష్యం తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

దీపావళికి ముందు గాలి నాణ్యత సూచీ ఢిల్లీ కాలుష్యాన్ని 215-220 పాయింట్లుగా చూపించింది... దీపావళి తర్వాత అది 315-320కి పెరిగిందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. చాలామంది ప్రజలు బాణసంచాకు దూరంగా ఉన్నారని, కానీ కొన్ని ప్రాంతాల్లో బీజేపీ నేతలే బాణసంచా కాల్చేలా ప్రజలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.
Pollution
Delhi
Diwali
Fire Crackers
Air Quality

More Telugu News