Nara Lokesh: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేస్తామన్న ఆసుపత్రుల అసోసియేషన్.. ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్

Nara Lokesh demands AP Govt to release pending bills to Arogyasree hospitals
  • నెట్ వర్క్ లోని ఆసుపత్రులకు ప్రభుత్వం వెయ్యి కోట్లు బకాయిలు పెట్టిందన్న లోకేశ్
  • పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని వ్యాఖ్య
  • ఆసుపత్రులకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో ఉన్న ఆసుపత్రులకు గత 6 నెలలుగా జగన్ సర్కారు రూ. 1,000 కోట్ల బకాయిలు పెట్టిందని... ఈ కారణంగా ఈ నెల 27వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపి వేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి ఇది అద్దం పడుతోందని అన్నారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని అన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే విడుదల చేసి, సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Arogyasree
Network
Hospitals

More Telugu News