Rahul Dravid: ప్రపంచకప్‌లో భారత్ విజయాలకు కారణం చెప్పిన రాహుల్ ద్రవిడ్

India gave themselves a little bit of challenge says Rahul Dravid

  • అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత్
  • జట్టు తనకు తానుగా టాస్క్ పెట్టుకుందన్న ద్రవిడ్
  • సెమీస్‌కు ముందు కావాల్సినంత సమయం దొరికిందన్న కోచ్
  • టాపార్డర్ అద్భుతంగా రాణిస్తోందని ప్రశంస
  • మిడిలార్డర్‌పై సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుందని వ్యాఖ్య

ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. లీగ్ మ్యాచుల్లో అపజయం అన్నదే లేకుండా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. జట్టు వరుస విజయాలకు కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం చెప్పాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్‌ పెట్టుకుందని పేర్కొన్నాడు. విజయాల వైపు జట్టును నడిపించేందుకు ప్రత్యేకంగా జట్టుకు ఓ మిషన్‌ను ఇచ్చినట్టు చెప్పాడు.


‘‘ప్రపంచకప్ కోసం మేం కొన్ని సవాళ్లు సిద్ధం చేసుకున్నాం. తొమ్మిది వేర్వేరు నగరాల్లో జరిగిన మ్యాచుల్లో అభిమానుల నుంచి విశేషమైన మద్దతు లభించింది. వీలైనంత బాగా ఆడాలని, మంచి ప్రదర్శన కనబర్చాలని అనుకున్నాం. కుర్రాళ్లు కూడా చక్కగా ఆడారు’’ అని ‘స్టార్‌స్పోర్ట్స్‌’తో చెప్పుకొచ్చాడు. 

సెమీస్‌కు ముందు ఆరు రోజుల విశ్రాంతి లభించిందని, ఇది తమకు బాగా కలిసి వచ్చిందని అన్నాడు. జట్టులోని ఐదుగురు బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారని, ఇద్దరుముగ్గురు సెంచరీలతో అదరగొడుతున్నారని కొనియాడాడు. బంతితో ప్రయోగాలు కూడా లాభించాయని వివరించాడు. మరీ ముఖ్యంగా మిడిలార్డర్ అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించాడు. టాపార్డర్ కూడా పరుగుల వర్షం కురిపిస్తోందన్నాడు. లీడర్‌బోర్డు వంక చూస్తే రోహిత్, కోహ్లీ పరుగుల వాన కనిపిస్తుందని, వారు అద్భుతంగా ఆడుతున్నారని ద్రవిడ్ ప్రశంసించాడు. మిడిలార్డర్‌పై సహజంగానే ఎప్పుడూ కొంత ఒత్తిడి ఉంటుందని వివరించాడు.

  • Loading...

More Telugu News