Telangana Assembly Election: తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో 2,898 మంది
- నామినేషన్ దాఖలు చేసిన 4,798 మంది అభ్యర్థులు
- స్క్రూటినీలో నిన్న 608 నామినేషన్లను తిరస్కరించిన అధికారులు
- ఇవాళ కూడా కొన్ని నామినేషన్ల తిరస్కరణ!
- గజ్వేల్ బరిలో 114 మంది, కామారెడ్డి బరిలో 58 మంది
తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. చివరికి ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు మిగిలారు. 119 నియోజకవర్గాలకు గాను మొత్తం 4,798 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం జరిగిన స్క్రూటినీలో 608 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇవాళ కూడా పలు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. వడపోత అనంతరం ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు నిలిచారు. అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గం నుంచి 114 మంది బరిలో నిలిచారు. మేడ్చల్ నుంచి 67, కామారెడ్డిలో 58, ఎల్బీ నగర్లో 50 మంది, కొడంగల్లో 15 మంది పోటీలో ఉండగా, అత్యల్పంగా నారాయణపేట నుంచి ఏడుగురు మాత్రమే బరిలో నిలిచారు.