Ganta Srinivasa Rao: ’వద్దు వద్దు జగన్’ అని ప్రజలు ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా?.. ఫొటో షేర్ చేసిన గంటా శ్రీనివాసరావు
- ‘ఏపీ హేట్స్ జగన్’ అని ఇందుకే అంటున్నారంటూ ఫొటో పంచుకున్న గంటా
- నాలుగేళ్ల 8 నెలల కాలంలో జగన్ ఘనకార్యాలు ఇవేనన్న టీడీపీ నేత
- అమరావతి, మూడు రాజధానులు, కరెంటు కోతలు వంటి వాటిని ప్రస్తావించిన గంటా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఏపీ హేట్స్ జగన్’ అని రాష్ట్ర ప్రజలు ఎందుకు అంటున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో సరిపోతుందంటూ తన ఎక్స్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు.
ఈ నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో మీ ఘనకార్యాలు ఇవేనని పేర్కొన్నారు. ఆ ఫొటోలో ప్రజా వేదిక విధ్వంసం, రాజధాని లేకపోవడం, రుషికొండపై తవ్వకాలు, పెట్రోలు బాదుడు, మూడు రాజధానులు, మైనింగ్, గంజాయి, తరలిపోయిన పరిశ్రమలు, కరెంటు కోతలు అంటూ పలు విషయాలను ప్రస్తావించారు. ‘వద్దు వద్దు జగన్.. మళ్లీ మాకొద్దీ జగన్’ అని ఎందుకు అంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ గారూ? అని కామెంట్ చేశారు.