World cup 2023: ఆ క్యాచ్ చేజారడంతో చాలా బాధపడ్డా.. మహమ్మద్ షమీ.. వీడియో ఇదిగో!

Felt Terrible After Dropping Kane Williamsons Catch says Mohammed Shami
  • విలియమ్సన్ క్యాచ్ వదిలేయడంపై స్పందించిన బౌలర్
  • ఆ టెన్షన్ తోనే మరింత కసిగా బౌలింగ్ చేసినట్లు వెల్లడి
  • న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన షమీ
న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో కీలకమైన క్యాచ్ వదిలేయడంపై మహమ్మద్ షఫీ స్పందించాడు. విలియమ్సన్ క్యాచ్ చేజారడంతో చాలా టెన్షన్ పడినట్లు చెప్పుకొచ్చాడు. ఒక్కసారిగా టెరిబుల్ గా ఫీలయ్యానని, చాలా బాధపడ్డానని అన్నాడు. అది తనకు కాళరాత్రిగా మిగిలిపోతుందేమోనని భయపడినట్లు వివరించాడు. బౌలింగ్ చేసేటపుడు ఆ భయమే తనను వెంటాడిందని, బ్యాట్స్ మెన్ ను ఔట్ చేయడమే టార్గెట్ గా బంతులు సంధించానని తెలిపాడు.

బుధవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి ముందు 397 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. ఛేదనలో తొలుత తడబడ్డ న్యూజిలాండ్ జట్టు.. ఆ తర్వాత పుంజుకుని ఓ దశలో గెలుపు దిశగా సాగింది. ఆ సమయంలో ధాటిగా ఆడుతున్న విలియమ్సన్ కొద్దిలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ ను షమీ జారవిడిచాడు. దీంతో స్టేడియంలో టెన్షన్ నెలకొంది. ఆ తర్వాత బౌలింగ్ లో రాణించిన షమీ.. ఏకంగా ఏడు వికెట్లు తీసి జట్టును ఫైనల్ కు చేర్చాడు.
World cup 2023
semi final match
India vs new zealand
mohammed shami
wiliamson catch
7 wickets
wankede

More Telugu News