World Cup: 2 బంతుల్లో 2 వికెట్లు తీసిన హెడ్... 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
- కోల్ కతాలో తగ్గిన వర్షం
- మళ్లీ మొదలైన ఆసీస్-దక్షిణాఫ్రికా సెమీస్ మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
- 35 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లకు 134 పరుగుల స్కోరు
కోల్ కతాలో వరుణుడు శాంతించడంతో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ మళ్లీ మొదలైంది. ఆట పునఃప్రారంభం తర్వాత క్లాసెన్, డేవిడ్ మిల్లర్ నిలకడగా ఆడడంతో దక్షిణాఫ్రికా స్కోరు 100 మార్కు దాటింది.
అయితే, ఆసీస్ పార్ట్ టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ తన ఆఫ్ స్పిన్ తో వెంటవెంటనే రెండు వికెట్లు తీసి సఫారీలను మరిన్ని కష్టాల్లోకి నెట్టాడు. మొదట క్లాసెన్ ను ఓ చక్కని బంతితో బౌల్డ్ చేసిన హెడ్... ఆ తర్వాతి బంతికే మార్కో యన్సెన్ ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దాంతో సఫారీ జట్టు 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 47 పరుగులు చేశాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 35 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లకు 134 పరుగులు. డేవిడ్ మిల్లర్ 55, గెరాల్డ్ కోట్జీ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.