dr k laxman: యాభై లక్షల మంది ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

DR K laxman on employement in telangana

  • వివిధ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్న విషయాన్ని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసిందని వెల్లడి
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయలేదన్న లక్ష్మణ్
  • డీఎస్సీ ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాక స్కూల్స్ మూతబడే పరిస్థితి ఉందని వ్యాఖ్య

టీఎస్‌పీఎస్సీలో ఇరవై లక్షల మంది ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకొని ఆశగా ఎదురు చూస్తున్నారని, నమోదు చేసుకోని యువతను కలిపితే ఆ సంఖ్య యాభై నుండి అరవై లక్షలగా ఉంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. వివిధ శాఖల్లో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలున్న విషయాన్ని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతకు ఇప్పటికీ ఉద్యోగాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయలేదన్నారు.

డీఎస్సీ ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాక స్కూల్స్ మూతబడే పరిస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మాట తప్పారన్నారు. 2014 నుంచి లక్షా ముప్పై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ చెబుతున్నారని, కానీ తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయో వెల్లడించడం లేదన్నారు. 2018 ఎన్నికల సమయంలో ఉద్యోగాల గురించి మాట్లాడితే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News