Sri Padmavathi Amma Vaaru: తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి కోట్ల విలువైన సారె
- తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు
- నవంబరు 10న ప్రారంభమైన కార్తీక బ్రహ్మోత్సవాలు
- రూ.2.5 కోట్ల విలువైన బంగారు కాసుల మాల, యజ్ఞోపవీతం సమర్పించిన టీటీడీ
- సారెను తలపై మోస్తూ ఆలయానికి తీసుకువచ్చిన భూమన, ధర్మారెడ్డి
తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. నవంబరు 10న ప్రారంభమైన అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేడు పంచమి తీర్థం, ధ్వజావరోహణంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో, తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి విలువైన సారె పంపారు. సారెలో భాగంగా రూ.2.5 కోట్ల విలువైన బంగారు కాసుల మాల, యజ్ఞోపవీతం సమర్పించారు. కాసుల మాల బరువు 5 కిలోలు. ఈ సారెను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు భక్తులకు ప్రదర్శించారు. కాగా, ఈ సారెను భూమన, ధర్మారెడ్డి స్వయంగా తలపై మోస్తూ అమ్మవారికి ఆలయానికి తీసుకువచ్చారు.