Ind Vs Aus: ఆ పని మాత్రం చేయకూడదు.. టీమిండియాకు బీసీసీఐ ప్రెసిడెంట్ సూచన
- ఆస్ట్రేలియాను లైట్ తీసుకోకూడదన్న బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ
- ఇప్పటికే ఆస్ట్రేలియా ఐదు సార్లు కప్ గెలిచిందని గుర్తు చేస్తూ హెచ్చరిక
- అయితే, మంచి ఫాంలో ఉన్న ఇండియా గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన బిన్నీ
నేడు ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రపంచ కప్ తుదిపోరులో భారత్ విజయం సాధిస్తుందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఐదు సార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిగా భారత్, ఆసిస్ తలపడనున్న విషయం తెలిసిందే. ఇక మూడోసారి ప్రపంచకప్ గెలవాలని భారత్ ఉవ్విళ్లూరుతుంటే ఆరోసారి కప్ సాధించాలని ఆస్ట్రేలియా గట్టిపట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇప్పటివరకూ టోర్నీలో ఇండియా అద్భుతంగా రాణించింది. మేము అన్ని మ్యాచ్‌లూ గెలిచాం. అయితే, తుదిపోరు అద్భుతంగా ఉండబోతోంది. కానీ, ఆస్ట్రేలియాను లైట్ తీసుకోకూడదు. అది గొప్ప టీం. ఇప్పటికే ఐదు ప్రపంచకప్‌లు గెలిచింది. అయితే, తుదిపోరులో ఇండియానే విజయం సాధిస్తుందని నమ్ముుతున్నా’’ అని రోజర్ బిన్నీ మీడియాతో వ్యాఖ్యానించారు.