Team India: 140 కోట్ల మంది మీ వెంటే ఉన్నారు... టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్ తదితరులు
- ఇవాళ వరల్డ్ కప్ గ్రాండ్ ఫైనల్
- అహ్మదాబాద్ లో టీమిండియా × ఆసీస్
- టీమిండియాపై శుభాకాంక్షల వెల్లువ
- కప్ గెలవాలంటూ ప్రముఖుల విషెస్
టీమిండియా ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ అధికారపక్షం బీఆర్ఎస్ పార్టీ తదితరులు టీమిండియాకు విషెస్ తెలిపారు.