Travis Head: రోహిత్ శర్మ ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్

Travis head calls rohit most unlucky man in the world

  • కప్ గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రావిస్ హెడ్
  • రోహిత్ క్యాచ్ పడతానని అస్సలు అనుకోలేదని వ్యాఖ్య
  • ఫైనల్స్‌లో సెంచరీతో రికీ పాంటింగ్, గిల్ క్రిస్ట్ సరసన నిలవడంపై హర్షం

ఒకప్పుడు స్లెడ్జింగ్‌కు మారుపేరుగా నిలిచిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికీ సందర్భం దొరికినప్పుడల్లా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తుంటారు. ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఓపెనర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రావిస్ హెడ్ మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్‌లో సెంచరీ చేసి రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ వంటి దిగ్గజాల సరసన చేరతానని అస్సలు అనుకోలేదని పేర్కొన్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పిన రోహిత్ వికెట్‌ గురించి కూడా చెప్పాడు. తాను అతడి క్యాచ్ పట్టుకుంటానని ఊహించలేదని అన్నాడు. 

‘‘మిచెల్ మార్ష్ పెవిలియన్ చేరాక వికెట్ కఠినంగా ఉందని అర్థం అయ్యింది. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయడం గొప్ప నిర్ణయం. మ్యాచ్ గడిచే కొద్దీ వికెట్ మెరుగైంది. పిచ్ మధ్యలో కొద్దిగా స్పిన్‌కు అనుకూలించింది. సెంచరీ చేయడం, రోహిత్ శర్మ క్యాచ్ పట్టడం నేను అస్సలు ఊహించలేదు. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతుడు రోహిత్‌యేనేమో. ఫైనల్స్‌లో సెంచరీ చేసిన రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ తరువాతి స్థానంలో నేనున్నాను. మొత్తంగా నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని ట్రావిస్ హెచ్ చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News