KTR: కేంద్రాన్ని 10 సార్లు అడిగినా ప్రయోజనం లేకపోయింది: కేటీఆర్
- ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటిపోయామన్న కేటీఆర్
- కాంగ్రెస్ నేతలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా
- విపక్షాల మాటలు విని ఆగం కావొద్దని ఓటర్లకు సూచన
ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని... కాంగ్రెస్, బీజేపీలతో ఈ ఘనత సాధించగలమా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అద్భుత నగరంగా మారిందని అన్నారు. హైదరాబాద్ కు ఏం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ నేతలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ రోడ్లను వెడల్పు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని 10 సార్లు అడిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు.