Counting: ఓట్ల లెక్కింపునకు 49 కేంద్రాలు.. సిటీలోనే 14 కేంద్రాలు

Stage Set For Counting Of Votes In 49 Centres In Hyderabad
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు
  • హైదరాబాద్ లో 14 లెక్కింపు కేంద్రాలు
  • రంగారెడ్డి జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ఈసీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్.. తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టతనిచ్చింది. డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే మొత్తం 14 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాలలో పోలైన ఓట్లను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 13 నియోజకవర్గాలకు విడివిడిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమైనట్లు తెలిపారు.

హైదరాబాద్ లో లెక్కింపు కేంద్రాలు ఇవే..
ముషీరాబాద్ – ఏవీ కాలేజ్, దోమల్ గూడ
నాంపల్లి – జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, మాసబ్ ట్యాంక్
కార్వాన్ – ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, మాసబ్ ట్యాంక్
గోషామహల్ – తెలంగాణ మహిళా వర్సిటీ, కోఠి
చార్మినార్ – కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, నాంపల్లి
చాంద్రాయణగుట్ట – నిజాం కాలేజ్, బషీర్ బాగ్
బహదూర్ పురా – అరోరా కాలేజ్, బండ్లగూడ
సికింద్రాబాద్ – డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, ఓయూ
కంటోన్మెంట్ – వెస్లీ కాలేజ్, సికింద్రాబాద్
యాకత్ పురా – సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయ, నాంపల్లి
మలక్‌పేట – ఇండోర్ స్టేడియం, అంబర్ పేట, రెడ్డి ఉమెన్స్ కాలేజ్, నారాయణగూడ
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ – కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ
సనత్ నగర్ – కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఓయూ క్యాంపస్

రంగారెడ్డి జిల్లాలో..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం; రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ నియోజకవర్గాల కౌంటింగ్ లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్; ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్; రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలిలో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఈసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Counting
Elections
Telangana
vote counting
EC
49 counting centers

More Telugu News