Jagan Bail: జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్.. జగన్, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court issues notices to Jagan

  • జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో రఘురాజు పిటిషన్
  • విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం
  • ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురాజు తరపు న్యాయవాది ధర్మాసనంకు తెలిపారు. జగన్ తోపాటు, సీబీఐ, ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

మరోవైపు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్ లో రఘురాజు కోరారు. దీన్ని పిటిషన్ కు జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురాజు న్యాయవాది కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News