Uttarkashi Tunnel: ఆ 41 మందిని రక్షించేందుకు మరో పెద్ద అడ్డంకి.. మరికాసేపట్లో కీలక నిర్ణయం
- మెటల్ గిర్డర్‌ను ఢీకొట్టిన అమెరికన్ అగర్ డ్రిల్లింగ్ మెషీన్
- సహాయక కార్యక్రమాల్లో ఇదో పెద్ద అవరోధమన్న సిబ్బంది
- టన్నెల్‌కు నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయం!
ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకుపోయిన 41 మందిని రక్షించే ప్రయత్నంలో మరో పెద్ద అడ్డంకి ఏర్పడింది. సాంకేతిక సమస్య కారణంగా కొన్ని గంటలపాటు నిలిచిపోయిన పనులు ప్రారంభమైన వెంటనే అమెరికన్ అగర్ డ్రిల్లింగ్ మెషీన్ మెటల్ గిర్డర్‌ను తాకింది. సహాయ కార్యక్రమాల్లో ఇదో ‘పెద్ద అవరోధ’మని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.
ఇలా అయితే లాభం లేదని భావిస్తున్న అధికారులు టన్నెల్‌కు నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. టన్నెల్ సైట్ వద్ద త్వరలో సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రభుత్వ సంస్థలు టన్నెల్‌కు నిలువుగా డ్రిల్లింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.