MS Dhoni: ప్రపంచ కప్ ఎలెవన్ లో ధోనీకి చోటులేదట.. లిస్టులో ఎవరున్నారంటే..!
- ధోనీకి షాక్ ఇచ్చిన ఫాక్స్ క్రికెట్.. కెప్టెన్ గా పాంటింగ్ పేరు
- ప్రపంచకప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో టీమ్
- వికెట్ కీపర్ గా కుమార సంగక్కర బెస్ట్ అంటున్న ఫాక్స్ క్రికెట్
వన్డే ప్రపంచకప్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లతో ఆస్ట్రేలియాకు చెందిన ‘ఫాక్స్ క్రికెట్’ ఓ జట్టును కూర్పు చేసింది. తన ఆల్ టైమ్ ప్రపంచకప్ ఎలెవన్ జట్టును తాజాగా ప్రకటించింది. అత్యుత్తమ కెప్టెన్ గా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఈ జట్టులో చోటివ్వలేదు. కెప్టెన్ గా రికీ పాంటింగ్, వికెట్ కీపర్ గా శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరలను జట్టులో చేర్చింది. ఇందులో అత్యధికంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురికి చోటు దక్కగా.. భారత్ నుంచి దిగ్గజ ఆటగాడు సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రపంచకప్ ఎలెవన్ లో చోటుదక్కింది. రికీ పాంటింగ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు 2003, 2007 లలో వన్డే ప్రపంచకప్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అందుకే ప్రపంచకప్ ఎలెవన్ కు పాంటింగ్ ను కెప్టెన్ గా ప్రకటించినట్లు ఫాక్స్ క్రికెట్ తెలిపింది.
ఫాక్స్ క్రికెట్ టీమ్ ఇదే..
1. సచిన్ టెండూల్క ర్ (ఇండియా)
2. రోహిత్ శర్మ (ఇండియా)
3. రికీ పాంటింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా)
4. విరాట్ కోహ్లీ (ఇండియా)
5. వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)
6. కుమార సంగక్కర (శ్రీలంక)
7. వసీం అక్రమ్ (పాకిస్థాన్)
8. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
9. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)
10. గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)
11. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)