Ravi Shastri: ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడం కంటే కబడ్డీ ఆడడం చాలా కష్టం: రవిశాస్త్రి
- డిసెంబరు 2 నుంచి దేశంలో ప్రొ కబడ్డీ తాజా సీజన్
- తొలి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ తో గుజరాత్ జెయింట్స్ ఢీ
- ప్రొ కబడ్డీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రవిశాస్త్రి
- కబడ్డీ ఆడాలంటే దమ్ముండాలని వెల్లడి
- ఎంతో ఫిట్ గా ఉంటే తప్ప కబడ్డీ ఆడలేరని స్పష్టీకరణ
భారత్ లో త్వరలో ప్రొ కబడ్డీ తాజా సీజన్ ప్రారంభం కానుంది. డిసెంబరు 2న జరిగే సీజన్ తొలి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. కాగా, ప్రొ కబడ్డీ కోసం భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఓ ప్రమోషన్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, కబడ్డీ ఆడడం కంటే ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కోవడమే సులభం అని పేర్కొన్నారు. కబడ్డీ ఆడాలంటే దమ్ముండాలని అభిప్రాయపడ్డారు. ఎంతో ఫిట్ గా ఉంటే తప్ప కబడ్డీ ఆడలేరని తెలిపారు.
తాను కూడా చిన్నప్పుడు ముంబయి వీధుల్లో కబడ్డీ ఆడానని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నారు. తాము ఆడుతుంటే కాలనీలో అందరూ చూసేవాళ్లని చెప్పారు. ఇప్పుడు కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారని, ఎక్కడో ఉన్న న్యూజిలాండ్, పోలెండ్ దేశాల్లో కూడా కబడ్డీకి ప్రజాదరణ లభిస్తోందని, ఆ దేశాల్లో కబడ్డీ ఆడడం తాను చూశానని తెలిపారు.