CUSAT: కేరళ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురి మృతి

stampeded in keralas CUSAT university four dead

  • కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఘటన
  • కళాశాలలో టెక్ ఫెస్ట్ జరుగుతుండగా అకస్మాత్తుగా వర్షం
  • వర్షం మొదలవడంతో వేదిక బయటున్న వారు ఒక్కసారిగా లోపలికి రావడంతో తొక్కిసలాట
  • 64 మందికి గాయాలు, ఘటనపై సీఎం పినరయి విజయన్ సంతాపం

కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ‌లో(సీయూఎస్ఏటీ) జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతిచెందగా మరో 64 మంది గాయపడ్డారు. శనివారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన టెక్ ఫెస్ట్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి పాసులున్న వారినే అనుమతించారు. అయితే, అకస్మాత్తుగా వర్షం మొదలవడంతో వేదిక బయటున్న వారు లోపలికి రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. గాయపడిన వారికి కాలామస్సేరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో వివిధ శాఖల మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది. ఘటనపై మంత్రివర్గం విచారం వ్యక్తంచేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేసింది.

  • Loading...

More Telugu News