Wine shops: తెలంగాణలో రెండు రోజులు వైన్స్ బంద్.. ఎప్పుడంటే!
- ఈ నెల 28 సాయంత్రం 5 నుంచి బంద్
- అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ ఆదేశాలు
- ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు బంద్ పెట్టాలని సూచించింది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను మూసేయాలని పేర్కొంది. రాష్ట్రంలో పోలింగ్ ముగిసే వరకూ.. అంటే ఈ నెల 30 సాయంత్రం 5 గంటల వరకు తెరవొద్దని వైన్ షాపు యజమానులకు సమాచారం అందించింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి వైన్ షాప్ తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. అదేవిధంగా అక్రమ మద్యం రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఈసీ సూచించింది. ఇప్పటి వరకు ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్న రూ.115.71 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.