Chandrababu: మద్యం కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

AP HC reserves verdict on Chandrababu bail plea in liquor case
  • ముందస్తు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్న చంద్రబాబు, కొల్లు రవీంద్ర
  • హైకోర్టులో ముగిసిన ఇరువైపు వాదనలు
  • తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీని ఆదేశించిన హైకోర్టు
మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. తాము తీర్పును వెలువరించేంత వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. రేపు ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Chandrababu
Kollu Ravindra
Telugudesam
Luquor Case
AP High Court

More Telugu News