Calling Sahasra: ప్రతీ ఒక్కరికీ నచ్చేలా తీశాను .. 'కాలింగ్ సహస్ర' దర్శకుడు అరుణ్ విక్కిరాలా
- సస్పెన్స్ థ్రిల్లర్ గా 'కాలింగ్ సహస్ర'
- సుధీర్ జోడీకట్టిన డాలీషా
- నేపథ్య సంగీతం హైలైట్ అంటున్న దర్శకుడు
- డిసెంబర్ 1వ తేదీన సినిమా రిలీజ్
సుడిగాలి సుధీర్ తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా మీడియాతో ముచ్చటించాడు.
* ‘కాలింగ్ సహస్ర’ అనే టైటిల్ అర్థం ఏంటి?
-- 'కాలింగ్' అనేది కంపెనీ పేరు. 'సహస్ర' అనేది హీరోయిన్ పాత్ర పేరు. కాలింగ్ సహస్ర అనేది కథలోంచి పుట్టిందే. సినిమాకు సరిపోయే టైటిల్ అనే పెట్టాం.
* సుధీర్‌ను ఇంతవరకూ కమెడియన్‌గా చూశాం.. ఈ కథలో ఆయన్ని ఎలా చూడబోతోన్నాం?
-- కాలింగ్ సహస్ర స్టార్ట్ అయిన తరువాత పది నిమిషాలకు సుధీర్ అనే వ్యక్తిని మీరు మరిచిపోతారు. ఆయన పోషించే పాత్రలోకి వెళ్తారు. పాత్రతో కనెక్ట్ అవుతారు. ఇందులో సుధీర్ కమెడియన్‌గా ఎక్కడా కనిపించడు. ఇది ఓ ప్రయోగమే .. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.
* సుధీర్ కాకుండా ఇతర పాత్రలకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది?
-- ఈ చిత్రంలో సుధీర్‌తో పాటుగా శివ బాలాజీ గారి పాత్ర, డాలీషా కారెక్టర్లకు మంచి పేరు వస్తుంది. డాలీషా ఓ ఫైట్ సీక్వెన్స్ చేసింది. ఫైట్ మాస్టర్ చూసి క్లాప్స్ కొట్టేశాడు.
* ముందుగా ఈ కథను ఎవరికి చెప్పారు? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?
-- 'గూఢచారి' టైంలో అడివి శేష్ గారికి ఈ కథను చెప్పాను. ఆయన చేయాల్సిన ఈ సినిమా మిస్ అయింది. నేను ఎన్నో యాడ్స్ చేశాను. కరోనా టైమ్ లో పోలీసులకు ఎన్నో డాక్యుమెంటరీస్ చేశాను. త్రీ మంకీస్ సినిమాకు రైటర్‌గా పనిచేశాను. 'త్రీ మంకీస్' కంటే ముందే ఈ కథను సుధీర్ కి చెప్పాను. నాకు ఎందుకు ఈ కథ చెబుతున్నారు.. నేను సెట్ అవుతానా? అని సుధీర్ గారు చాలా ఆలోచించారు. 'త్రీ మంకీస్' టైమ్ లో మేం ఇంకా క్లోజ్ అయ్యా. ఆ తరువాత ఈ కథ స్టార్ట్ చేశాం.
* ‘కాలింగ్ సహస్ర’ నిర్మాతలు ఎలా సహకరించారు?
-- నిర్మాతలు ఎంతో సహకరించారు. వారు లేకపోతే ఈ సినిమా ఇక్కడివరకూ వచ్చేది కాదు. డిసెంబర్ 1న వస్తున్నామంటే దానికి కారణం కూడా వారే. 'యానిమల్'తో పోటీగా రావడం లేదు .. 'యానిమల్'తో పాటుగా వస్తున్నాం.
* ‘కాలింగ్ సహస్ర’లో టర్న్స్ అండ్ ట్విస్టులు ఎలా ఉంటాయి?
-- ఈ చిత్రంలో చాలా ట్విస్టులుంటాయి. ఆ ట్విస్టులు అందరికీ తెలిసినా కూడా థియేటర్‌కు వచ్చి చూస్తారు. ఇందులో మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. ఇందులో నేరుగా సందేశం ఇవ్వం. కానీ అంతర్లీనంగా ఓ మెసెజ్ ఉంటుంది.
* ‘కాలింగ్ సహస్ర’లో సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది?
-- పాటలు మోహిత్ ఇచ్చారు. ఆర్ఆర్ రాబిన్ ఇచ్చారు. మోహిత్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ టైంలో రాబిన్‌ను తీసుకుని ఫినిష్ చేశాం. ప్రేక్షకుల్ని ఆర్ఆర్ వెంటాడుతూ ఉంటుంది. ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ చూడొచ్చు. అందరికీ అర్థం అయ్యేలా తీశాను. అందరికీ నచ్చతుంది. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుంది" అని చెప్పాడు.