State Election Commission: ఆన్‌లైన్‌లో ఓటర్ స్లిప్‌ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!

Down load voter slip in this way

  • 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసిన ఈసీ
  • ఇంకా కొందరికి అందని స్లిప్పులు 
  • ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేసింది. ఈ నెల 25వ తేదీతో ఈ ప్రక్రియ ముగిసింది. అయితే వివిధ కారణాల వల్ల ఇంకా కొందరికి స్లిప్పులు అందలేదు. అలాంటి ఓటర్లు నేరుగా స్లిప్పులు పొందేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి ఓటరు వివరాలు నమోదు చేసి ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా? తెలుసుకోవచ్చు. అదే సమయంలో ఓటర్ స్లిప్పును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ స్లిప్పులో పోలింగ్ బూత్ వివరాలు, పోలింగ్ తేదీ, ఓటర్ సీరియల్ నెంబర్ వంటివి ఉంటాయి.

- మొదట నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
https://voters.eci.gov.in/

- సైట్ ఓపెన్ అయిన తర్వాత ఎలక్టోరల్ రోల్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

- అక్కడ క్లిక్ చేయగానే కొత్త వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

- ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా? లేదా? అని రెండు మార్గాల్లో చెక్ చేసుకోవచ్చు.

- మొదటి మార్గంలో మీ పేరు, మీ తండ్రి లేదా భర్త పేరు, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం ఎంటర్ చేయాలి. 

- రెండో మార్గంలో ముందుగా మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

- మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా వెబ్ సైట్ మీకు మీ ఓటరు సమాచారాన్ని అందిస్తుంది.

- ఓటర్ లిస్టులో కనుక పేరు లేకుంటే మీకు నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది.

ఎస్సెమ్మెస్‌తో ఓటర్ లిస్టు చెక్ చేసుకోండిలా....

- ముందుగా మీ మొబైల్ మెస్సేజ్ సెక్షన్‌లో EPIC అని టైప్ చేయాలి.

- స్పేస్ ఇచ్చి ఓటర్ ఐడీ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

- ఈ ఎస్సెమ్మెస్‌ను 9211728082 కు లేదంటే 1950 నెంబర్‌కు పంపించాలి.

- ఆ తర్వాత మీ మొబైల్ స్క్రీన్‌పై మీ పోలింగ్ స్టేషన్ నెంబర్, మీ పేరు డిస్‌ప్లే అవుతాయి.

- ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే నో రికార్డ్ ఫౌండ్ అని సమాధానం వస్తుంది.

  • Loading...

More Telugu News