Nara Lokesh: నా సన్నిహితుడికి జగన్ పాలనలో పదవి ఇచ్చారా?: నారా లోకేశ్
- తన సన్నిహితుడికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారంటూ సాక్షిలో కథనం వచ్చిందన్న లోకేశ్
- సాక్షి పత్రికకు సిగ్గు లేదా? అని ప్రశ్న
- బూదాటి లక్ష్మీనారాయణకు బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చిందన్న లోకేశ్
ముఖ్యమంత్రి జగన్ భార్య భారతీ రెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తన సన్నిహితుడికి జగన్ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? ఏమ్మా భారతీ రెడ్డిగారు, తప్పుడు సాక్షి పత్రికకు సిగ్గు అనేది లేదా? అని మండిపడ్డారు. రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు వైసీపీ పాలనలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. ముడుపులు అందుకోకుండానే బూదాటి లక్ష్మీనారాయణను టీటీడీ బోర్డు మెంబర్ చేయాలని కరకట్ట కమల్ హాసన్ సిఫారసు చేశారా? అని అడిగారు. ఇక డ్రామాలు కట్టిపెట్టు కరకట్ట కమల్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త అబద్దయ్యగారు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజం.. అందుకు ఆయనను తాను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. వార్తా పత్రికలో వచ్చిన ఒక కథనాన్ని షేర్ చేశారు.