padi koushik reddy: భావోద్వేగ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

Case filed against Padi Kaushik Reddy
  • ఎన్నికల ప్రచారంలో మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేసిన పాడి కౌశిక్
  • ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఎంపీడీవో ఫిర్యాదు
  • విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఈసీ ఆదేశం
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కమలాపూర్ ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా, ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే నాలుగో తేదిన మా ముగ్గురి శవయాత్రకు మీరు రావాల్సి వస్తుందని, ఏ యాత్రకు వస్తారో మీరు నిర్ణయించుకోవాలని ప్రజలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కేసు నమోదయింది.
padi koushik reddy
Telangana Assembly Election
BJP
BRS

More Telugu News