Governor: ఎన్నికల నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సందేశం

Governor Tamilisai message to Telangana people
  • అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తమిళిసై విజ్ఞప్తి
  • ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందన్న గవర్నర్
  • ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరిన గవర్నర్
తెలంగాణ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె తెలుగులోనే విజ్ఞప్తి చేయడం గమనార్హం. 'ఓటర్లందరికీ నమస్కారం.. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అందరు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు' అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరీమరీ కోరుతున్నాను' అని గవర్నర్ పేర్కొన్నారు.
Governor
Tamilisai Soundararajan
Telangana Assembly Election

More Telugu News