Michaung: ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుకు పేరు ఇదే!
- ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
- డిసెంబరు 2 నాటికి తుపాను
- తుపానుకు మిచౌంగ్ అనే పేరును సూచించిన మయన్మార్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుంది. కాగా, బంగాళాఖాతంలో తుపాను ఏర్పడితే దానికి 'మిచౌంగ్' అని పిలుస్తారు. ఈ పేరును మయన్మార్ సూచించింది. ఇది డిసెంబరు 2 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మధ్య బలపడనుంది.
ప్రస్తుతం వాతావరణ సంస్థలు పేర్కొంటున్న వివరాల ప్రకారం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోసాంధ్ర తీరాల మధ్య ఇది భూభాగంపైకి ప్రవేశించనుంది. అయితే, ఇది దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదని విశాఖ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పేర్కొంటున్న గమన దిశలోనే తుపాను పయనిస్తే ఏపీకి ముప్పు ఉంటుందని పేర్కొంటున్నారు.