Rahul Gandhi: నా తెలంగాణ సోదర సోదరీమణులారా అంటూ... రాహుల్ గాంధీ ట్వీట్

Rahul Gandhi message on Telangana polling day says Rahul Gandhi
  • తెలంగాణలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ
  • ఈరోజు దొరలపై ప్రజలు గెలవబోతున్నారని రాహుల్ ట్వీట్
  • అధిక సంఖ్యలో ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్ లకు తరలి వస్తున్నారు. నెమ్మదిగా పోలింగ్ శాతం పెరుగుతోంది. మరోవైపు పోలింగ్ డే సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈరోజు దొరలపై ప్రజలు గెలవబోతున్నారని రాహుల్ అన్నారు. 'నా తెలంగాణ సోదర సోదరీమణులారా... రండి... అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి. కాంగ్రెస్ ను గెలిపించండి' అని ఆయన ట్వీట్ చేశారు. రాహల్ ట్వీట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రీట్వీట్ చేశారు.
Rahul Gandhi
Congress
Telangana Elections
Polling

More Telugu News