Sri Lanka Cricket Team: ఫుల్ జోష్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు.. వరుస సిరీస్‌లను ప్రకటించిన బోర్డు.. భారత్‌తో వన్డే, టీ20 సిరీస్
- శ్రీలంకపై నిషేధాన్ని ఎత్తేసిన ఐసీసీ
- వచ్చే ఏడాది జింబాబ్వే పర్యటనతో టూర్ మొదలు
- టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్
- ఏడాదిలో మొత్తం వన్డేలు, టీ20లు, టెస్టులు కలిపి 51 మ్యాచ్‌లు ఆడనున్న లంక జట్టు
శ్రీలంక క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) ఇటీవల తొలగించడంతో ఆ జట్టు భారత్ పర్యటనకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్‌తో మూడు వన్డేలు, అంతే సంఖ్యలో టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు రానుంది. ఈ మేరకు 2024లో శ్రీలంక క్రికెట్ షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది.
దీని ప్రకారం శ్రీలంక జట్టు వచ్చే ఏడాది మొత్తం 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20లు సహా మొత్తం 51 మ్యాచ్‌లు ఆడనుంది. జనవరిలో జింబాబ్వేతో సిరీస్‌తో ఆ జట్టు అంతర్జాతీయ పర్యటన ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్, భారత్‌తో తలపడుతుంది. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. ఇది ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. జనవరిలో ఆఫ్ఘనిస్థాన్, ఫిబ్రవరిలో ఇంగ్లండ్, ఆ తర్వాత శ్రీలంకలో పర్యటిస్తుంది.