Rahul Dravid: కోచ్ పదవీకాలం పొడిగింపుపై ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్

Rahul Dravid gave a twist on the extension of the tenure of the coach

  • తాను ఇంకా పత్రాలపై సంతకం చేయలేదన్న మాజీ దిగ్గజం
  • పేపర్లు అందాక చర్చిస్తామన్న రాహుల్ ద్రావిడ్
  • తాజా వ్యాఖ్యలతో మరింత సస్పెన్స్ క్రియేట్ చేసిన ‘మిస్టర్ డిపెండబుల్’

టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పొడిగింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రధాన కోచ్ సహా కోచింగ్ సిబ్బంది పదవీకాలాన్ని పొడగింపునకు నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ ప్రకటించిన మరుసటి రోజే ద్రావిడ్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఇంకా ఎలాంటి అధికారిక పత్రాలపై సంతకం చేయలేదని అన్నాడు. అయితే పదవీకాలంపై చర్చలు జరిగాయని చెప్పాడు. ‘‘నేను ఇంకా దేనిపైనా సంతకం చేయలేదు. కాంట్రాక్ట్ పొడిగింపునకు సంబంధించిన పత్రాలు అందాక మేము చర్చిస్తాం’’ అని ద్రావిడ్ అన్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌కి జట్టు ఎంపిక కోసం ద్రావిడ్ గురువారం ఢిల్లీ వెళ్లాడు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్‌తో సమావేశమయ్యాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం పొడిగింపుపై  సస్పెన్స్ ఇంకా వీడలేదు.


ఇదిలావుంచితే.. రాహుల్ ద్రావిడ్, అతడి కోచింగ్ సిబ్బంది పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయించినట్టు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంతకాలం పొడిగిస్తున్నారన్న విషయాన్ని పేర్కొనలేదు. అయితే ద్రావిడ్‌తో చర్చలు జరిపామని, అతడి పదవీకాలాన్ని కొనసాగించడానికి ఏకగ్రీవంగా అంగీకారం లభించినట్టుగా ప్రకటనలో బీసీసీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా కోచ్ పదవీకాలం పొడిగింపుపై క్లారిటీ వస్తే దక్షిణాఫ్రికా టూర్‌ నుంచే బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల ఆడనుంది. ఈ మేరకు ఇప్పటికే జట్లను బీసీసీఐ ఎంపిక చేసింది.

  • Loading...

More Telugu News