Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
- ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షలు
- నవంబరు 30తో ముగిసిన పరీక్షల ఫీజు చెల్లింపు గడువు
- డిసెంబరు 5 వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం
- ఆలస్య రుసుం లేకుండానే చెల్లించవచ్చని వెల్లడి
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.
వాస్తవానికి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు నవంబరు 30తో ముగిసింది. అయినప్పటికీ, మరో 5 రోజులు గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 5 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండానే ఎగ్జామ్ ఫీజులు చెల్లించవచ్చని సౌరభ్ గౌర్ తెలిపారు. ఇది రెగ్యులర్, ప్రైవేటు ఇంటర్ జనరల్, ఒకేషనల్ గ్రూపుల విద్యార్థులందరికీ వర్తిస్తుందని అన్నారు.
కాగా, రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి.