Uganda: కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు
- ఉగాండాకు చెందిన మహిళ అరుదైన రికార్డు
- కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా 70 ఏళ్ల వయసులో సంతానభాగ్యం
- సిజేరియన్ ద్వారా కవలల్ని కన్న వృద్ధురాలు
- తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాల ప్రకటన
ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చారు. సంతానోత్పత్తి పద్ధతుల ద్వారా తల్లయిన ఆమె ఆఫ్రికాలోనే అత్యంత పెద్దవయసులో తల్లయిన మహిళగా రికార్డు సృష్టించారు. కంపాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఆమె సిజేరియన్ ద్వారా ఓ బాబు, పాపకు జన్మనిచ్చారు. వృద్ధురాలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇన్‌విట్రో ఫలదీకరణ చికిత్స ద్వారా ఆమె సంతానభాగ్యం పొందినట్టు పేర్కొన్నారు. 2020లో కూడా సఫీనా ఈ చికిత్స ద్వారానే ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. కాగా, 2019లో భారత్‌లో దక్షిణాదిన ఓ వృద్ధురాలు 73 ఏళ్ల వయసులో పిల్లల్ని కన్నట్టు అప్పట్లో కథనాలు ప్రచురితమయ్యాయి.