Alive In Morgue: చచ్చిబతికి.. చచ్చిపోయిన 90 ఏళ్ల వృద్ధురాలు.. విచారణకు ఆదేశించిన బ్రెజిల్ ప్రభుత్వం
- బ్రెజిల్‌లోని శాన్‌జోస్ నగరంలో ఘటన
- కాలేయ సమస్యతో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు
- చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు
- బ్యాగులో చుట్టి శవాగారానికి తరలింపు
- కొన్ని గంటల తర్వాత బ్యాగ్ కదులుతుండడంతో చూసిన సిబ్బంది షాక్
- కళ్లు తెరిచి చూస్తుండడంతో భయంతో కేకలు
ఆ 90 ఏళ్ల వృద్ధురాలు చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. సిబ్బంది ఆమె మృతదేహాన్ని బాడీ బ్యాగ్‌లో కుక్కి శవాగారానికి తరలించారు. ఆ తర్వాత కొన్ని గంటలకు శవాగార సిబ్బంది ఒకరు బాడీ బ్యాగ్ కదలడాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. భయంగానే అక్కడికెళ్లి బ్యాగ్ తెరచి చూస్తే చనిపోయిందనుకున్న వృద్ధురాలు నవ్వుతూ కనిపించడంతో అతడి పై ప్రాణాలు పైనే పోయాయి. బ్రెజిల్‌లోని శాన్ జోస్ నగరంలో జరిగిందీ ఘటన.