kotha prabhakar reddy: దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి... బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం
- 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి
- తొలి రౌండ్ నుంచీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం
- ఆందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ విజయం
దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుపొంది, 51 స్థానాల్లో ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించి 34 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 1 స్థానంలో గెలిచి 7 స్థానాల్లో ముందంజలో ఉంది. దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి... సమీప అభ్యర్థి, బీజేపీ నేత రఘునందన్ రావుపై 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధిక్యం కనిపించింది.
ఆందోల్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడి నుంచి దామోద రాజనర్సింహ గెలుపొందారు. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రెడ్డి గెలుపొందారు. రోహిత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై నెగ్గారు.