Singireddy Niranjan Reddy: వనపర్తిలో మంత్రి నిరంజన్ వాహనంపై దాడి!

Attack on minister Niranjan Reddy vehicle in Vanaparthi
  • వనపర్తిలోనూ గెలుపు దిశగా కాంగ్రెస్
  • 13వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి భారీ ఆధిక్యం
  • కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగిన మంత్రి నిరంజన్ రెడ్డి
  • మంత్రి వాహనంపై చెప్పులు, రాళ్లు!
వనపర్తిలో కాంగ్రెస్ విజయం దాదాపుగా ఖాయమైంది. దాంతో, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆయన వాహనంపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు వెళ్లిపోతున్న నిరంజన్ రెడ్డిపై చెప్పులు, రాళ్లు విసిరారు. దాంతో అక్కడ ఓ మోస్తరు ఉద్రిక్తత నెలకొంది. 

వనపర్తి నియోజకవర్గం 13వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి నిరంజన్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి 12,343 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ సరళిపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. తాము పనులు చేసిన చోట, చేయని చోట ప్రజలు ఒకేలా స్పందించారని అభిప్రాయపడ్డారు. తాను అధికారంలో ఉన్నన్నాళ్లు వందేళ్లకు సరిపడా అభివృద్ధి పనులు చేశానని చెప్పుకొచ్చారు.
Singireddy Niranjan Reddy
Vanaparthi
BRS
Megha Reddy
Congress
Telangana Assembly Results

More Telugu News